Header Banner

మీ ఆన్‌లైన్ పనులు చిటికెలో పూర్తి చేసే టూల్! ఏఐ ఏజెంట్ ఆపరేటర్ విశేషాలు ఇవే!

  Sat Feb 22, 2025 18:54        Technology

ఏఐ మార్కెట్లో కూడా క్రమంగా ట్రెండ్ మారుతోంది. రోజుకో కొత్త టూల్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓపెన్ ఏఐ నుంచి మరో ఆవిష్కరణ వచ్చేసింది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.

చైనా ఏఐ డీప్‌సీక్ వచ్చిన తర్వాత, ప్రస్తుతం ఏఐ మార్కెట్లో పోటీ మరింత పెరిగిందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే తాజాగా ఓపెన్ ఏఐ (OpenAI) నుంచి మరో కొత్త ఆవిష్కరణ వెలుగులోకి వచ్చింది. అదే AI ఏజెంట్ ఆపరేటర్ (AI agent operator). దీనిని బ్రెజిల్, కెనడా, ఇండియా, జపాన్ సహా పలు దేశాలలో విడుదల చేశారు. ఇది వినియోగదారుల కోసం వెబ్‌లో వివిధ రకాల పనులను చేస్తుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే ఈ ఏజెంట్ మీ ఆన్‌లైన్ పనిని వేగంగా, సరళంగా చేయగలదు.

 

ఇది కూడా చదవండి: ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. యుద్ధం ముగియాలంటే అదొక్కటే మార్గం!

 

ఈ AI ఏజెంట్ ఆపరేటర్ మానవుల మాదిరిగానే ఫారమ్‌లను నింపడం నుంచి ఆన్‌లైన్‌లో బుకింగ్ సేవల వరకు అన్ని పనులను చేస్తుందని చెబుతున్నారు. ఓపెన్ ఏఐ గత నెలలో అమెరికాలో ఈ ఫీచర్‌ను ప్రారంభించింది. కానీ ఇప్పుడు ఈ ఆపరేటర్ భారతదేశంతో పాటు ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, జపాన్, సింగపూర్, దక్షిణ కొరియా, యూకేలో కూడా అందుబాటులోకి వచ్చింది. ఐరోపా దేశాల్లో కూడా ఈ సేవలను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు సంస్థ తెలిపింది. ఈ క్రమంలో వినియోగదారులు దీనిని ఉపయోగించడానికి ChatGPT ప్రో సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది.

ఈ క్రమంలో ఏజెంట్ ఆపరేటర్ సహాయంతో మీరు కమాండ్‌ ద్వారా పలు రకాల పనులను పూర్తి చేసుకోవచ్చు. ఇది కంప్యూటర్ యూజింగ్ ఏజెంట్ (CUA) మోడల్‌ను ఉపయోగించి పనులను నిర్వహిస్తుంది. అందుకోసం ఏ రకమైన ఫారం పూరించాలి, బుకింగ్ సేవలు, ఆన్‌లైన్ ఆర్డర్‌ వంటి పనులను స్వయంచాలకంగా చేయగలదు. దీనిని ఉపయోగించడానికి వినియోగదారులు వెబ్‌పేజీని సందర్శించాలి. ఇది ప్రత్యేక బ్రౌజర్ విండోలో మాత్రమే పనిచేస్తుంది. దీనిని వినియోగదారులు ఎప్పుడు కావాలంటే అప్పుడు నియంత్రించుకోవచ్చు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఇది GPT 4o అధునాతన సాధనాలతో వెబ్‌సైట్‌లను స్కాన్ చేస్తుంది. ఆ క్రమంలో బ్రౌజర్‌ ద్వారా పనిచేస్తూ, వెబ్ పేజీలను క్లిక్ చేస్తుంది. టైప్ చేయడంతోపాటు స్క్రోల్ కూడా చేయగలదు. పాస్‌వర్డ్ నమోదు చేయడం, చెల్లింపు చేయడం లేదా ఇతర సున్నితమైన సమాచారం అవసరమైతే, అది మీ నియంత్రణకు అప్పగిస్తుంది.

డేటా భద్రత విషయంలో OpenAI అత్యంత జాగ్రత్తలు తీసుకుందని చెబుతున్నారు. AI ఏజెంట్ ఆపరేటర్ ఎలాంటి ఆర్థిక లావాదేవీలను స్వయంచాలకంగా నిర్వహించదని కంపెనీ ఇప్పటికే స్పష్టం చేసింది. వినియోగదారులు తమ గోప్యతా సెట్టింగ్‌లను నియంత్రించడానికి, బ్రౌజింగ్ డేటాను తొలగించడానికి, డేటా సేకరణను నిలిపివేయడానికి ఆప్షన్లను కలిగి ఉంటారని తెలిపింది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ప్రజలకు అప్డేట్.. ఆధార్ కార్డులో కొత్త మార్పు! ఇది తెలుసుకోకపోతే నీ పరిస్థితి ఇక అంతే!

 

ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త హైవేకు లైన్ క్లియర్! ఈ జిల్లాలకు మహర్దశ!

 

పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

 


   #AndhraPravasi #Andhrapradesh #online #aitool #Aiagent